‘కూలీ’ సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చాయని దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెప్పాడు. అన్ని ట్రోల్స్ వచ్చినా కూడా రజినీకాంత్ కోసం ప్రేక్షకులు సినిమాను చూశారని తెలిపాడు. తాను అంచనాల ఆధారంగా కథను రాయలేనని పేర్కొన్నాడు. రాసుకున్న కథలోని పాత్రలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే.. తర్వాత సినిమాలో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాడు.