JGL: బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన నూతనంగా ఎన్నికైన ఇండిపెండెంట్ సర్పంచ్ ధర్మరాజు, గ్రామస్తులతో కలిసి శుక్రవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.