TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రేపు జరగబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తిన బాట పట్టారు. పార్టీ పరంగా అత్యంత కీలకమైన ఈ భేటీలో.. జాతీయ రాజకీయాలు, రాష్ట్ర పరిణామాలపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.