VSP: పర్యావరణహిత జీవనానికి పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ ఎంతో ఉపయోగకరమని నగర మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో గ్రీన్ క్లైమేట్ టీం రూపొందించిన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ను అన్ని విద్యా సంస్థలకు ఉచితంగా అందించి, పర్యావరణ దినోత్సవాల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు.