శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 112 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. షఫాలీ(79*) హాఫ్ సెంచరీతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది.