SRCL: శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు. మండల కేంద్రంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్ శుక్రవారం ఏఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రకాల రికార్డ్స్ ,రిజిస్టర్లను పరిశీలించారు. మండల విస్తీర్ణత, గ్రామపంచాయతీలు, ఎక్కువగా కేసులు అయ్యే గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.