GNTR: పెదకాకాని హైవేపై శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించగా, శరీరం నుజ్జునుజ్జై భయంకరంగా మారింది. మృతదేహం ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా మారింది. దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మృతదేహాన్ని గుంటూరు కొవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు.