MLG: తాడ్వాయి మండలం పస్రా-తాడ్వాయి రహదారి మధ్య జలగలంచ వాగులో అటవీ శాఖ ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐల్యాండ్‌ను ఇవాళ మంత్రి సీతక్క పునఃప్రారంభించారు. ములుగు జిల్లా పర్యాటకులకు నిలయమని, బ్లాక్ బెర్రీ ఐల్యాండ్ కనువిందు చేసే ప్రదేశమని పర్యాటకులు తప్పక సందర్శించాలని కోరారు. కలెక్టర్ దివాకర్ టిఎస్, SP సుధీర్ రాంనాథ్ కేఖన్, అశోక్ ఉన్నారు.