ATP: జిల్లాలో రాబోయే ఆరు నెలల్లో తక్కువ బరువు, ఎత్తు లేని పిల్లలు ఉండకూడదని కలెక్టర్ ఆనంద్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యంపై పర్యవేక్షణ పెంచాలని, తప్పుడు గణాంకాలు నమోదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ‘బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్’ పోస్టర్లను ఆవిష్కరించారు.