కృష్ణా: మచిలీపట్నం లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈగల్ విభాగం సంయుక్తంగా NDPS యాక్ట్ గురించి శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ రైటర్లకు,కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ అందించారు. NDPS కేసులో సమాచారం అందించినప్పటి నుంచి చార్జిషీట్ దాఖలు చేసే వరకు ఎస్సై నుండి పై అధికారి పాటించాల్సిన విధివిధానాల గురించి వివరించారు.