WG: టీ.డీ.పీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా తణుకు పట్టణానికి చెందిన బసవ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఇతర నాయకులు రామకృష్ణను అభినందించారు. గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తణుకు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు.