VZM: జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన ఛైర్మన్గా నియమితులైన డొంకాడ రామకృష్ణ శుక్రవారం రాజంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ బాధ్యత లభించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.