మూడో టీ20లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటర్లలో దులాని (27), హాసిని (25), కవిషా(20) మాత్రమే రాణించగా, మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లతో చెలరేగగా, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. కాగా, భారత్ టార్గెట్: 113.