ADB: ఆదిలాబాద్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విమానాశ్రయ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక ఎయిర్పోర్టు మైదానాన్ని సందర్శించి, విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భూసేకరణ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.