E.G: బొమ్మూరు పాఠశాల మైదానంలో భాష్యం ఈస్ట్-2 జోన్ ‘ఒలంపస్ గేమ్స్’ శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. TDP రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యదర్శి గోరంట్ల శాంతారామ్ క్రీడలను ప్రారంభించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. జూనియర్,సీనియర్ బాలికలకు ఖో-ఖో, చెస్ వంటి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి మానసిక ఉల్లాసాన్ని పొందాలని శాంతారామ్ సూచించారు.