KNR: ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరుకావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఈ మేరకు ఆలయ ఛైర్మన్ ఇంగిలే రామారావు శుక్రవారం మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని కోరారు.