E.G: తాళ్లపూడి మండలం పెద్దేవం జడ్పీ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు గోపాలపురం ఏఎస్ఓ జోడలా వెంకట్ శుక్రవారం మోడల్ పేపర్స్ అందించారు. అనంతరం గోపాలపురం మండలం తహశీల్దార్ కార్యాలయంలో మొక్కల పంపిణీ చేశారు. మొక్కల పెంపకంతో వాతావరణ ప్రభావాన్ని తగ్గించవచ్చు అనే సందేశాన్ని అందించుటకు 50 మొక్కలు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు.