KMR: దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 250 గొర్రెలు, మేకలకు ఈ మందులు వేసినట్లు మండల పశువైద్యాధికారి శివ తెలిపారు. నట్టల వల్ల వచ్చే వ్యాధుల నుంచి పశువులను రక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.