VSP: జీవీఎంసీ పరిధిలోని ఆస్తి, కొళాయి తదితర పన్ను చెల్లింపుదారులు అపరాధ రుసుము బారిన పడకుండా వెంటనే బకాయిలు చెల్లించాలని కమిషనర్ కోరారు. మొదటి అర్ధ సంవత్సరానికి ఇప్పటికే 2% చక్రవడ్డీ విధిస్తుండగా, డిసెంబరు 31 తర్వాత రెండో అర్ధ సంవత్సరానికి కూడా వడ్డీ వర్తించనుందన్నారు. జీవీఎంసీ వెబ్సైట్, పురమిత్ర యాప్ ద్వారా త్వరగా పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలన్నారు.