మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ సీఎస్ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు శాంతియుతంగా జరుగుతున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ అన్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ బందోబస్తును ఆయన పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, సీసీటీవీ పర్యవేక్షణను తనిఖీ చేసి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.