మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా మేకర్స్ ఈ మూవీలోని ‘మెగావిక్టరీమాస్’ సాంగ్ ప్రోమోను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేశారు. పూర్తి పాటను ఈనెల 30 విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.