MBNR: జడ్చర్ల మండలంలోని తంగళ్లపల్లికి చెందిన శతాధిక వృద్ధురాలు కుమ్మరి శాంతమ్మ (100) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించిన ఆమెకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆమె సంతతిలో మనమలు, మునిమనుమలు కలిపి మొత్తం 150 మందికి పైగా ఉండటం విశేషం. శాంతమ్మ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.