కృష్ణా: విద్యార్థులు సమాజం, దేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలని నారా భువనేశ్వరి సూచించారు. నిమ్మకూరులోని గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు కష్టపడి చదివారని, ఆయనపై నమ్మకంతోనే ప్రజలు CMగా ఎన్నుకున్నారని చెప్పారు. NTR ట్రస్ట్ ద్వారా సేవలు కొనసాగుతున్నాయని, దాతలు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు.