E.G: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐ.పంగిడికి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి తపాలా శాఖ బీమా ద్వారా ఆర్థిక భరోసా లభించింది. శుక్రవారం తపాలా శాఖ సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాస్, మృతుడి తల్లి భాగ్యలక్ష్మికి రూ.5,22,827 విలువైన చెక్కును అందజేశారు. తపాలా శాఖ బీమా పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.