SKLM: ఆమదాలవలస స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్‌ను స్థానిక టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గౌరవ సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమాజభివృద్ధికి పాత్రికేయుల కృషి ఎనలేనిదని అన్నారు.