W.G: కుమ్మరపాలెంలో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు టీ.డీ.పీ యలమంచిలి మండల అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు శంకుస్థాపన చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు సారథ్యంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోణం నాని, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.