AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. గతంలో తాము చేపట్టిన పనులన్నీ జగన్ పాలనలో ధ్వంసం అయ్యాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.