E.G: కొవ్వూరు మండలం కాపవరం సొసైటీలో రైతులకు అవసరమైన యూరియా సహా అన్ని రకాల ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని ఛైర్మన్ సుంకర సత్తిబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా కొనసాగుతోందన్నారు. స్థానిక రైతాంగాం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.