PPM: మహిళల రక్షణ, వారికి ఆపద సమయాల్లో అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ సెంటర్’ (సఖి) నూతన వాహనాన్ని కలెక్టరెట్ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హింసకు గురైన మహిళలకు తక్షణ సేవలు అందించడమే ఈ వాహనం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు.