కృష్ణా: పెనమలూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజల వద్ద నుండి శుక్రవారం అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్న తనను లేదా తన కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని తెలిపారు. ప్రతి సమస్యను వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరం కానీ పరిష్కరించేలా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.