AP: అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పుట్లూరు చెరువుకు నీరు విడుదల చేయాలని జేసీ కోరారు. పెనకచర్ల డ్యామ్ నుంచి నీరు ఇవ్వాలన్నారు. నీరు ఇవ్వకపోతే పుట్లూరు మండలంలో రైతులు నష్టపోతారని కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.