VSP: మధురవాడ వైఎస్ఆర్ కాలనీలో పీఎంపాలెం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సీఐ జి.బాలకృష్ణ ఆదేశాల మేరకు ఎస్సైలు బి.నరేష్, ఎన్.శ్రావణి సిబ్బందితో కలిసి ఇళ్లను తనిఖీ చేశారు. ఆధార్ కార్డులు, వాహన పత్రాలు పరిశీలించి పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.