KNR: మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామ సర్పంచ్ పార్నంది కిషన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో ఆయనకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో వార్డు సభ్యులు తాళ్ల వెంకటేశ్, నెలవేణి సుశీల, కోమల్ల నరేష్ పాల్గొన్నారు.