NLG: చిట్యాల మండలం నేరడలో మృతి చెందిన చేనేత కార్మికుడు పులిపాటి శ్రీరాములు కుటుంబానికి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకులు కాసోజు శంకరాచారి ఇవాళ రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. మృతుడి చిత్రపటానికి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.