NLG: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నిధులు ప్రకటించారు. కేంద్ర నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ. 5 లక్షలు, పెద్ద జీపీలకు రూ. 10 లక్షలు నేరుగా అందించనున్నారు. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోని 1,779 పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది. నేరుగా సర్పంచులకే నిధులు ఇస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.