SS: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వయంగా దివ్యాంగుల వద్దకే వెళ్లి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఇక నుంచి ప్రతి నెలా నాలుగో శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని ఆయన ప్రకటించారు. వచ్చిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని అదేశించారు.