ATP: తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో ఈనెల 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి వేడుకల ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. టౌన్ ఎస్సై గౌస్ బాషా, ఆలయ ఈవో రామాంజనేయులు క్యూలైన్లు, దర్శన వేళలు మరియు భద్రతపై చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.