VZM: భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కొండగుంపాంలో సీపీఐ పార్టీ మండల కార్యదర్శి మొయిద పాపారావు జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సీపీఐ సమ సమాజ నిర్మాణం కోసం భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిందని అన్నారు. దేశంలో దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పోరాడిన చరిత్ర ఎర్ర జెండాకు ఉందన్నారు.