AP: ప్రధాని మోదీ పాలనలో ఐటీ, టెలివిజన్ రంగాల్లో పెట్టుబడులు సరళీకరణ చేశామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 81వ ర్యాంకు నుంచి 38వ ర్యాంకుకు చేరుకుందన్నారు. దశాబ్ద కాలంగా స్టార్టప్ రంగంలో భారత్ దూసుకుపోతోందని పేర్కొన్నారు. స్పేస్ ఎకానమీలో 8వ స్థానానికి చేరుకున్నామని వివరించారు.