KNR: తిర్యాణి మండలం గోయగం గ్రామానికి చెందిన మేక భీమేష్(37) అనే వ్యక్తిపై ఇవాళ ఉదయం అడవి పందుల గుంపు దాడి చేసింది. దీంతో భీమేష్కు తీవ్ర గాయాలు అయ్యాయినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి పంటచేనుకు కావాలిగా వెళ్లిన భీమేష్ ఉదయం తిరిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగ అడవి పందులు దాడి చేశాయని,పేర్కొన్నారు. వెంటనే వారు భీమేష్ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలియాజేశారు.