BHNG: కేసీఆర్ మాట్లాడే భాష తిట్ల పురాణం గూగుల్ సెర్చ్, యూట్యూబ్లో చూస్తే మీకు తెలుస్తుందని, హరీష్ రావుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితువు పలికారు. ఆయన మాట్లాడుతూ.. నీ మామ కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏది పడితే అది మాట్లాడితే చెల్లింది. ఎందుకంటే నీళ్లు ఉద్యోగాలు కోసం చేస్తున్న పోరాటం కదా అని తెలంగాణ సమాజం భరించిందన్నారు.