SRPT: గుంటూరు జిల్లా నల్లపాడు పిఎస్ పరిధిలోని అంకిరెడ్డిపాలెం హైవేలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట వాసులు ముగ్గురు మృతి చెందారు. తిరుపతికి వెళ్లి వచ్చే క్రమంలో కారును అంకిరెడ్డి పాలెం గ్రామ సమీపంలో రోడ్డుపై ఆపారు. ఈ క్రమంలో కారును వెనుక నుంచి బస్ ఢీ కొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.