VZM: రాజాం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారిలో సంచరిస్తూ వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులను గురువారం విశాఖపట్నం గోశాలకు తరలించారు. పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని రాజాం మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు పేర్కొన్నారు. ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి వాటిని గోశాలకు తరలించేస్తామని స్పష్టం చేశారు.