MNCL: శాండ్ మాఫియాకు మంత్రి వివేక్ వెంకటస్వామి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కొందరు వ్యక్తులు శాండ్ మాఫియా మీద అక్రమంగా సంపాదించిన డబ్బును సర్పంచ్ ఎలక్షన్లో విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. మాఫియాను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని అడ్డుకట్ట వేస్తుందని హామీ ఇచ్చారు.