NGKL: బిజినపల్లి మండలం లట్టుపల్లి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఊడుగుల గుంట తండా చెందిన శంకర్ నాయక్ (50) గంగారం నుంచి ప్రయాణిస్తుండగా అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య మణితో పాటు ముగ్గురు సంతానం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.