PPM: పార్వతీపురం జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ‘మన్యం గోబాల సంబరం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఎం.ఆర్. నగరం పశువైద్య శాల ప్రాంగణంలో ఉదయం 9:00 గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించనున్నారు.