SRPT: భారత మాజీ ప్రధాని వాజ్పేయి జీవితం స్ఫూర్తిదాయకమని మాజీ మున్సిపల్ ఛైర్మన్, బీజేపీ నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. గురువారం సూర్యాపేటలో వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలను నడిపిన చరిత్ర వాజ్పేయికే దక్కిందన్నారు.