NTR: ఏ. కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన అత్తునూరు కృష్ణారెడ్డి గొడ్ల చావిడి గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో అక్కడ నిలిపి ఉంచిన ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. అలాగే నాలుగు పాడి గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.