SRCL: దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాన మంత్రి అని బీజేపీ మండల అధ్యక్షుడు మొక్కిలే విజేందర్ అన్నారు. ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ జండా గద్దె వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హనుమయ్య చారి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.