మెదక్ చర్చ్ ప్రాంగణంలో తప్పిపోయిన ఒక బాలుడిని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్‌కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ బాలుడితో ఆప్యాయంగా మాట్లాడి అతని తల్లిదండ్రుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పోలీసుల అప్రమత్తతతో కొద్ది సేపటిలోనే బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నాడు. పోలీసుల చాతుర్యానికి స్థానికుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.